logo

చెక్‌పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్‌  నైట్‌ బీట్‌, చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా  బీవీ నగర్‌ పరిధిలోని నైట్‌బీట్‌లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. 

Published : 18 Apr 2024 11:16 IST

నెల్లూరు కలెక్టరేట్‌ : జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్‌  నైట్‌ బీట్‌, చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా  బీవీ నగర్‌ పరిధిలోని నైట్‌బీట్‌లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని నైట్‌బీట్‌ సిబ్బందికి సూచించారు. రాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే,  ప్రశ్నించి,  వారి వేలిముద్రలు, వివరాలను బీట్‌బుక్‌లో పొందుపరచాలన్నారు. నగదు, మద్యం, నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రాత్రి వేళ తిరిగే ఆకతాయిలు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని