logo

పల్లె పాలనకు వైకాపా గ్రహణం

వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్‌ సెంటర్‌ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది.

Published : 20 Apr 2024 04:41 IST

దేవతమహల్‌ సెంటర్‌ వద్ద మురుగు కాలువ దుస్థితి

  • పంచాయతీ: వింజమూరు
  • వార్డులు 7,8
  • పరిధి : నడిమూరు, కొత్తూరు
  • సమస్యలు: మురుగు కాలువలు, పారిశుద్ధ్యం నిర్వహణ

వింజమూరు, న్యూస్‌టుడే : వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్‌ సెంటర్‌ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. దీంతో మురుగు పారటంలేదు. పెద్ద కాలువ పూర్తిగా పూడిపోయింది. కాలువలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో సమస్య మరింత జఠిలమైంది. కాలువ పొడవునా ఇళ్ల ముందు వృథా నీరు చేరి అనేక సమస్యలకు కారణమవుతోంది. దోమల స్వైర విహారంతో కంటిమీద కునుకు కరవైందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దీంతోపాటు చెత్త సమస్యలు కూడా పేరుకుపోయాయి.విద్యుత్తు స్తంభాల నుంచి తీగలు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి.కుళాయి పైపులనుంచి నీరులీకవుతోంది.

పాలకుల స్పందన కరవు

పల్లాల నాగిరెడ్డి, నడిమూరు

నడిమూరులో మురుగు కాలువలు దుస్థితిలో ఉన్నాయి. బైపాస్‌ రోడ్డు దారిలో విద్యుత్తు స్తంభాలు రోడ్డుగా అడ్డంగా ఉన్నాయి. అధికారులు పక్కన ఏర్పాటు చేస్తామని చెబుతున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. వింజమూరు-ఆత్మకూరు రోడ్డులో బైపాస్‌ మలుపు వద్ద వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెన కూలిపోయే ప్రమాదం ఉంది.


వింజమూరు-ఆత్మకూరు రోడ్డులో..

  • వార్డులు 9,10
  • పరిధి : యర్రబల్లిపాలెం, మోటచింతలపాలెం, చిట్టేటిమిట్ట

కొత్తూరు, యర్రబల్లిపాలెంలలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. స్థానిక శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నా పంచాయతీ పాలకులు పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టలేదు. వింజమూరు-ఆత్మకూరు రోడ్డులో లక్ష్మీప్రియ థియేటర్‌ వద్ద రోడ్డుపై చెత్త నిల్వ ఉంది. దీర్ఘకాలంగా చెత్తను ఎత్తడం లేదు. ఎత్తు ప్రదేశాలకు తాగునీరు అందడంలేదని ఆయా ప్రాంతాల వారు ఆందోళన చెందుతున్నారు. 

నిర్వహణ అధ్వానం:తిప్పిరెడ్డి మురళీకృష్ణారెడ్డి, కొత్తూరు

కొత్తూరు ప్రాంతంలో మురుగు కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. కాలువలు నిర్మించింది మొదలు ఇప్పటి వరకు పూడిక తీయలేదు. కాలువ పైకి ముళ్లపొదలు పెరిగి కాలువ ఆనవాళ్లు అసలు కనిపించడం లేదు. కొన్నిచోట్ల సిమెంటు రోడ్లు వేసినా వాటికి అనుగుణంగా పక్క కాలువలు నిర్మించలేదు. మురుగు ముందుకు సాగక ఇబ్బంది పడుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని