logo

నేడు పొదలకూరులో ప్రజాగళం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు.

Published : 20 Apr 2024 04:55 IST

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు రాక

న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), పొదలకూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. ఉదయం గూడూరులో మహిళలతో సమావేశం అనంతరం.. మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.25 గంటలకు పొదలకూరు మర్రిపల్లి సెంటర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2.40కి గేట్‌ సెంటర్‌కు వస్తారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. 4.45కు హెలికాప్టర్‌లో బయలుదేరి తిరుపతి జిల్లా సత్యవేడుకు వెళ్లతారు.

భారీ బందోబస్తు

చంద్రబాబునాయుడు ప్రజాగళం సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ రాంబాబు తెలిపారు. ఇద్దరు డీఎస్పీలు, పది మంది సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, 23 మంది ఎస్సైలు, 290 మంది సిబ్బంది, 60 మంది స్పెషల్‌, రోప్‌ పార్టీతో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

నాయకులతో కలిసి హెలిప్యాడ్‌ను పరిశీలిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

హెలిప్యాడ్‌, సభాస్థలి పరిశీలన

సూచనలు చేస్తున్న చంద్రబాబునాయుడు ప్రతినిధి కృష్ణ, ఆర్‌అండ్‌బీ అధికారులు

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయన ప్రతినిధి కృష్ణ శుక్రవారం తెల్లవారుజాము నుంచే హెలిప్యాడ్‌, సభా స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పార్టీ నాయకుల సలహాలు, పోలీసు బందోబస్తు వివరాలు తెలుసుకుని.. ఆర్‌అండ్‌బీ అధికారుల పర్యవేక్షణలో పనులు చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని