logo

ఉలవపాడులో స్టిక్కర్ల దుమారం

మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు.

Published : 30 Apr 2024 04:28 IST

వైకాపా స్టిక్కరు అంటించిన యువకులతో మాట్లాడుతున్న ఎంపీడీవో విజయలక్ష్మి

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండల కేంద్రంలో సోమవారం వైకాపా గుర్తుతో స్టిక్కర్లు అంటించడంపై దుమారం రేగింది. వివిధ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ద్విచక్రవాహనాలపై వచ్చి పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఇళ్లకు వైకాపా స్టిక్కర్లు అంటించారు. ఇది గమనించిన స్థానికులు ప్రశ్నించడంతో తాము అంటించలేదని చెప్పడంతో.. వారు వెంటనే మండలాధికారులు, పోలీస్‌స్టేషన్‌కు ఫోను ద్వారా తెలియజేశారు. దీంతో అక్కడకు వచ్చిన పంచాయతీ సిబ్బంది.. ఆ స్టిక్కర్లను తొలగించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న పోలీస్‌కానిస్టేబుల్‌, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ కార్యదర్శులు వారిని ఎంపీడీవో కార్యాలయానికి తరలించారు. వీరిలో ఒకరిది చిత్తూరు, మరొకరిది బాపట్ల, ఇంకో ఇద్దరిది తూ.గోదావరి జిల్లా, విజయవాడకు చెందిన వాళ్లుగా గుర్తించారు.  వైకాపా అభ్యర్థుల తరఫున అనుమతి ఉందని తమను పంపించారనీ, తాము ప్రచారానికి మాత్రమే వచ్చామని యువత చెబుతున్నారు.ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి వద్ద స్టిక్కర్లు లేవని ఎంపీడీవో విజయమ్మ తెలిపారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇతర జిల్లాల నుంచి వచ్చినవారిని వదిలివేసినట్లు తెలిపారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని