logo

పరిహారం పేరుతో జగన్నాటకం

పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది.

Published : 30 Apr 2024 04:29 IST

భూసేకరణ డీసీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న రైతులు

కావలి : పల్లె ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ఎన్నికల నియమావళి అమలుకు ఒకరోజు ముందు భూసేకరణ ప్రకటన విడుదల చేసింది. దీనిపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇంత హడావుడిగా ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కావలి సమీపంలోని రామాయపట్నంలో పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల ఏర్పాటుకు భూ సేకరణకు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే ముందురోజు ప్రభుత్వం విడుదల చేసింది. ఇది తెలిసిన చెన్నాయపాలెం గ్రామస్థులు ఆందోళనకు పూనుకున్నారు. సోమవారం పట్టణంలోని భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. డిప్యూటీ కలెక్లర్‌ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని