logo

పార్లమెంటు అభ్యర్థులకు గుర్తులు

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్‌ హరినారాయణన్‌ ఎన్నికల గుర్తులు కేటాయించారు.

Published : 30 Apr 2024 04:40 IST

గుర్తులు కేటాయిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి కలెక్టర్‌ హరినారాయణన్‌ ఎన్నికల గుర్తులు కేటాయించారు. కె.రాజు(కాంగ్రెస్‌)కు హస్తం గుర్తు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(తెదేపా)కి సైకిల్‌ గుర్తు, వేణుంబాక విజయసాయిరెడ్డి(వైకాపా)కి ఫ్యాన్‌ గుర్తు కేటాయించారు. నాసిన భాస్కర్‌ బహుజన శ్రామిక పార్టీకి ఏనుగు గుర్తు, జాజుల సోమశేఖర్‌ జైభారత్‌ నేషనల్‌ పార్టీకి టార్చిలైట్‌, తలారి వెంకయ్య జైభీమ్రావు భారత్‌ పార్టీకి కోటు, నక్క దినేష్‌ భారత్‌ చైతన్య యోజన పార్టీకి చెరకు రైతు, పుంగూరు ప్రసన్న గణపతి రాడికల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు కత్తెర, మల్లేపల్లి రఘు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి బకెట్‌, మన్నేపల్లి వివేక్‌ రివ్యులేషనరీ సోషలిస్ట్‌ పార్టీకి పారా పలుగు గుర్తులు కేటాయించారు. షేక్‌ మహబూబ్‌బాషా రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు కుట్టు మిషన్‌, ముజ్బిర్‌ రెహమాన్‌ పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు టెలివిజన్‌, షేక్‌ షఫి అహ్మద్‌ ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌కు సింహం, కొప్పాల రఘు ఇండిపెండెంట్‌ అభ్యర్థికి గ్యాస్‌ సిలిండర్‌ గుర్తులు కేటాయిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

గాజుగ్లాసు కేటాయింపుపై ఆందోళన

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి తరఫున తెదేపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో పసుపులేటి సుధాకర్‌, సర్వేపల్లి నియోజకవర్గంలో మన్నెం పుట్టయ్య, ఆత్మకూరు నియోజకవర్గంలో ధనిరెడ్డి రామనారాయణరెడ్డికి గాజు గ్లాస్‌ గుర్తులు కేటాయించారు. ఎన్నికల్లో ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకే అధికారులు గాజు గ్లాసు కేటాయించారని కూటమి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని