logo

ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం

మానవత్వం సజీవంగా ఉంచాలి అనేది ఈ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ నినాదమని రెడ్ క్రాస్ రక్తకేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు.

Published : 08 May 2024 19:23 IST

కావలి: మానవత్వం సజీవంగా ఉంచాలి అనేది ఈ సంవత్సరం ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవ నినాదమని రెడ్ క్రాస్ రక్తకేంద్రం కన్వీనర్ డాక్టర్ బెజవాడ రవికుమార్ పేర్కొన్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనంలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ సభ్యులు, సిబ్బంది, ఉద్యమ స్థాపకులు సర్ హెన్రి డునాంట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో ఉన్న సాటి మనిషిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. రెడ్ క్రాస్ ప్రపంచవ్యాప్తంగా రక్తకేంద్రాలు, ఆసుపత్రులు, విపత్తు సంసిద్ధతా బృందాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థి దశలోనే ఆరోగ్యం, సేవ, అంతర్జాతీయ స్నేహం వంటి మానవతా కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ విభాగాలను విద్యాసంస్థలలో ఏర్పాటు చేస్తోందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని