logo

సినీ నటుడు నారా రోహిత్‌ ఎన్నికల ప్రచారం

కావ్య సంకల్పం, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో కావలిలో తెదేపా గెలుపు ఖాయమని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు.

Published : 08 May 2024 19:25 IST

కావలి: కావ్య సంకల్పం, చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలతో కావలిలో తెదేపా గెలుపు ఖాయమని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఎన్డీఏ కూటమి  అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డికి మద్దతుగా నారా రోహిత్, కామెడియన్ రోలర్ రఘు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం కావలి రూరల్ మండలం ఆనేమడుగు, మొండిదిన్నెపాలెం, కట్టకిందపాలెం, బైనేటి వారిపాలెం, తాగేటివారిపాలెం, సర్వాయపాలెం పంచాయతీలో వారు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, భాజపా, జనసేన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని