logo

11వ తేదీ ఆరు గంటల వరకే ప్రచారానికి అనుమతి

ఈనెల 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు.

Published : 09 May 2024 05:29 IST

నెల్లూరు(కలెక్టరేట్‌): ఈనెల 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. బుధవారం నగరపాలకసంస్థ కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్‌కు 48 గంటల ముందు నిబంధనలను రాజకీయ పార్టీల అభ్యర్థులు పాటించాలన్నారు. పోలింగ్‌ రోజు 200 మీటర్ల దూరంలో ఒక బూత్‌ను రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. సమావేశంలో డీఆర్వో లవన్న, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ సుబ్రహ్మణ్యం, తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌ ప్రతినిధులు రసూల్‌, హరికృష్ణ, విజయ్‌, బాలసుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని