logo

కాలనీలు.. సమస్యలకు నిలయాలు

పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు  ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లో ఉండే ఖాళీ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి.

Published : 09 May 2024 05:32 IST

కావలి, న్యూస్‌టుడే

కావలి 30వ వార్డులో తరచూ రోడ్డుపైకి మురుగునీరు ఇలా

పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు  ఎక్కువగా ఉన్నాయి. జనావాసాల్లో ఉండే ఖాళీ ప్లాట్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఈకారణంగా దోమలతో ప్రజలు వ్యాధులకు గురవుతున్నారు.

  • 13వ వార్డు నుంచి పన్నుల రూపంలో ఆదాయం బాగా వస్తున్నా సౌకర్యాలు కల్పించడం లేదు. ఈ వార్డు పరిధిలో రామ్మూర్తిపేట, బృందావన కాలనీ  ప్రాంతాలున్నాయి. పారిశుద్ధ్యం అధ్వానంగా తయారవడంతో దోమల సమస్య తీవ్రంగా ఉంది.
  • 18వ వార్డులో జంగం, భైరాగుల కాలనీ, తుపాన్‌నగర్‌ ప్రాంతాలున్నాయి. ఇక్కడ నీటి కొరత తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే ట్యాంకర్లను పంపుతున్నారు. ఈ ప్రాంతవాసులు తెదేపాకు అనుకూలమని వైకాపా నాయకులు వివక్ష చూపుతున్నారు. పార్కును పురపాలక సంఘం పట్టించుకోకపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారింది.
  • కావలి పురపాలక సంఘంలోని 23వ వార్డు అంటే వెంగళరావునగర్‌ ప్రాంతం. ఈ ప్రాంతంలో పందుల, దోమల బెడద జాస్తిగా ఉంది.
  • పట్టణంలోని 25వ వార్డులో ప్రగతి నగర్‌ పరిధిలో విద్యుత్తు కార్యాలయం పక్కన ఉన్న రహదారి మురుగుమయంగా ఉంది.
  • 30వ వార్డు రైల్వే రోడ్డు, రాజావీధి, మున్సిపల్‌, పశుసంవర్థక శాఖ కార్యాలయ, తదితర ప్రాంతాలున్నాయి. దోమలబెడదతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారులకు చెబుతున్నా స్పందించరే!

సమస్యలు పరిష్కరించాలని కావలి పురపాలక సంఘం అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. కనీసం దోమల నివారణకు ఫాగింగ్‌ యంత్రం పంపించాలి. దీంతో రాత్రిళ్లు నిద్రకు దూరమవుతున్నాం.

శానం హరి, తుపాన్‌నగర్‌, 18వ వార్డు


మా వార్డులోనే కార్యాలయం

మా 30వ వార్డు పరిధిలోనే పురపాలక సంఘం కార్యాలయం ఉంది. అయినా అధికార యంత్రాంగానికి సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ ఉండడం లేదు. పశుసంవర్థ్ధక శాఖ కార్యాలయ ఆవరణలో ముళ్లపొదలున్నాయి. అటునుంచి విషపురుగులు వస్తున్నాయి.

ఈతముక్కల శ్రీరాజ్యలక్ష్మి, రాజావీధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని