logo

వైకాపా నాయకుల ఓట్ల బేరం

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపాకు గ్రామస్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు తెరదీశారు.

Published : 09 May 2024 05:44 IST

పొలాల వద్ద కూలీలతో మాట్లాడుతున్న వైకాపా నాయకులు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైకాపాకు గ్రామస్థాయిలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు తెరదీశారు. వీరి ఓట్ల బేరానికి చక్కని ఉదాహరణ ఇది... ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ కూలీలు పత్తి తీసేందుకు కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు, కందుకూరు గ్రామీణ మండలాలకు సుమారు 20 కూలీ ముఠాలు వలస వచ్చాయి. ఒక్కో ముఠాలో 20మంది చొప్పున ఉంటారు. మార్కాపురానికి చెందిన వైకాపా నాయకులు బుధవారం కందుకూరు గ్రామీణ మండలం మాచవరంలో వలస కూలీలకు రూ.5వేల చొప్పున పంపిణీ చేశారు. మిగతా కూలీలను కూడా ఈ నాయకులు కలిశారు. ఓటింగ్‌ ముందు రోజు రవాణా సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారని కూలీలు చెప్పారు. కందుకూరు నియోజకవర్గంలోనూ..కందుకూరు మండలంలోనూ వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. ఈ మండల కేంద్రం పక్కనే ఉన్న గ్రామంలో ఓటుకు రూ.5వేల చొప్పున పంపిణీ చేశారని స్థానికులు చెబుతున్నారు.అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదని విపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని