logo

విద్యార్థుల ఉత్తీర్ణతకు చర్యలు

పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ అనుబంధ పరీక్షల్లో పాసయ్యేలా హెచ్‌ఎంలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు తెలిపారు.

Published : 10 May 2024 04:44 IST

వింజమూరు, న్యూస్‌టుడే : పదో తరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ అనుబంధ పరీక్షల్లో పాసయ్యేలా హెచ్‌ఎంలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి పీవీజే రామారావు తెలిపారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని 57 మంది హెచ్‌ఎంలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మే 24 నుంచి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు ఆయా సబ్జెక్టులలో తగిన తర్ఫీదునిచ్చి సన్నద్ధం చేయాలన్నారు. 590 మార్కులు సాధించిన జలదంకి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పీవీ లక్ష్మీతేజస్విని, 589 మార్కులు సాధించిన సిద్దనకొండూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి వి. ధనుష్‌, 587 మార్కులు సాధించిన గుండెమడకల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె. సాయి తన్మయిలను సన్మానించారు. కార్యక్రమంలో కావలి ఉప విద్యాధికారి పి. రఘురామయ్య, ఎంఈవో ఎం. మధుసూదన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌ మాలకొండయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని