logo

Kamareddy: గుజరాత్ ప్రేరణ శిక్షణ శిబిరానికి వెళ్లిన కామారెడ్డి విద్యార్థులు

గుజరాత్‌లోని వాధ్ నగర్‌లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు బయలుదేరారు.

Published : 23 May 2024 20:03 IST

కామారెడ్డి పట్టణం: గుజరాత్‌లోని వాధ్ నగర్‌లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు బయలుదేరారు. జవహర్ నవోదయ విద్యాలయ నిజాంసాగర్ విద్యార్థి బొల్లిగడ్డ అరుణ్ కుమార్, జంగంపల్లి జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ విద్యార్థిని జివ్వాజి భావజ్ఞ, మెంటర్ టీచర్ శ్రీమతి ఫర్జానా ఈనెల 26 నుంచి 31 వరకు జరిగే శిక్షణ కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్రం నుంచి మొదటి దశకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ నెల 10, 23వ తేదీలలో జరిగిన జిల్లా స్థాయి ప్రేరణ పోటీలలో వీరిద్దరూ ప్రథమ స్థానం సాధించి మొదటి బ్యాచ్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని