logo
Published : 27/11/2021 04:33 IST

ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం : కోదండరాం


ఎల్లారెడ్డి గండిమాసానిపేటలో మాట్లాడుతున్న కోదండరాం

ఎల్లారెడ్డి పురపాలిక, కామారెడ్డి పట్టణం, అర్బన్‌, కామారెడ్డి: ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. రైతు రక్షణ యాత్రలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. జాప్యానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్‌, కామారెడ్డి మార్కెట్‌ యార్డులోని కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో మరణించిన రైతు కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెజస నాయకులు నిజ్జన రమేశ్‌, కుంబాల లక్ష్మణ్‌యాదవ్‌, తుల్జారెడ్డి, చాకలి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని