Published : 01 Dec 2021 04:19 IST
నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు
ఇందూరు సిటీ, న్యూస్టుడే: జిల్లాలో కొత్తగా కేటాయించిన మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 102 గాను మొదటి విడతగా 99 దుకాణాల లైసెన్సులు జారీ చేశారు. మంగళవారం మిగిలిన మూడింటికి కూడా లైసెన్సులు కట్టబెట్టారు. జిల్లాలో గత మద్యం పాలసీ ఉన్న రెండేళ్లలో సుమారు రూ.1,600 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి 11 దుకాణాలు పెంచడంతో పాటు ఎన్నికలు కలిసి రానుండటంతో రూ.2 వేల కోట్ల విక్రయాలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
Tags :