logo

సృజనాత్మకతకు పదును

విద్యార్థుల్లో సైన్స్‌పై మక్కువ పెంచేలా ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏటా నిర్వహిస్తుంటారు. వారికి సామాన్య ఉపాధ్యాయులు గైడ్‌ టీచర్లుగా వ్యవహరిస్తూ ప్రదర్శనకు రూపకల్పన చేస్తుంటారు. ప్రస్తుతం

Published : 27 Jan 2022 05:05 IST

బోధకులు, విద్యార్థుల నుంచి పరిశోధన పత్రాలు

అవకాశం కల్పించిన ఎస్‌సీఈఆర్‌టీ

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు

విద్యార్థుల్లో సైన్స్‌పై మక్కువ పెంచేలా ప్రేరణ, వైజ్ఞానిక ప్రదర్శనలు ఏటా నిర్వహిస్తుంటారు. వారికి సామాన్య ఉపాధ్యాయులు గైడ్‌ టీచర్లుగా వ్యవహరిస్తూ ప్రదర్శనకు రూపకల్పన చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ సృజనాత్మకతను పదును పెట్టుకునే అవకాశాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కల్పిస్తోంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ ఆలోచనలకు సంబంధించిన పరిశోధన పత్రాలు ఆహ్వానిస్తోంది. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధించేలా ప్రణాళికలు రూపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం.

ఏ అంశాల్లో.. సామాన్య బోధనా దృక్కోణాలు పునర్వచించడంతో పాటు ఉప అంశాలు, ప్రయోగశాలలు, వాస్తవ ప్రపంచం, ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం, స్థానిక సవాళ్లు, సమస్యల పరిష్కారాలను కనుక్కోవడం, 21వ శతాబ్దపు నైపుణ్యాలు- బోధనా అభ్యసన ప్రక్రియలో మార్పులపై పరిశోధన పత్రాలు అందించవచ్ఛు

ఫిబ్రవరి 2వ తేదీ తుది గడువు.. పరిశోధన పత్రాలు పంపించేందుకు ఫిబ్రవరి 2వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపికైన వారికి ఫిబ్రవరి 28న రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. వీటిలో ఉత్తమమైనవి ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన పరిశోధన పత్రాలతో పుస్తకాన్ని ముద్రిస్తారు. ఆన్‌లైన్‌ లేదా ప్రత్యక్ష పద్ధతిలో ప్రదర్శన నిర్వహిస్తారు.

సెమినార్‌ లక్ష్యాలు●

* సైన్స్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేలా ఉపాధ్యాయులను ప్రోత్సహించడం. ● సైన్స్‌ ద్వారా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆకాంక్షలు, సవాళ్లను ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనలతో ఎదుర్కొనేలా ప్రోత్సహించడం.

* ఉపాధ్యాయులు, అధ్యాపకులతోపాటు సైన్స్‌ పరిశోధకులు డీఈడీ, బీఈడీ చేసే అభ్యర్థులు, ఎన్జీవోలు తమ పరిశోధన పత్రాన్ని ఆంగ్లం లేదా తెలుగులో రూపొందించవచ్ఛు

* వెయ్యి పదాలకు మించకుండా నాలుగు పేజీల్లో రాసి tgscertmaths science @gmail.comకు పంపాలి.

అవకాశాన్ని వినియోగించుకోవాలి

- సిద్ధిరాంరెడ్డి, సైన్స్‌ జిల్లా అధికారి

ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు డీఈడీ, బీఈడీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్ఛు సెమినార్‌లో పాల్గొనేలా మండల విద్యాశాఖ అధికారులు, ఆయా పాఠశాలల యాజమాన్యాలు అవగాహన కల్పించాలి.

భవిష్యత్తుకు దోహదం : రాజు, డీఈవో

పరిశోధనా పత్రాలు చక్కగా రూపొందించి విద్యాశాఖ పరిశోధన మండలికి సమర్పించాలి. భవిష్యత్తులో ఆయా అంశాల్లో నైపుణ్యాలు వెలికితీసే క్రమంలో దీనిని పరిగణనలోకి తీసుకొంటారు. ప్రతి సైన్స్‌ ఉపాధ్యాయుడు ప్రదర్శన చేపట్టాలని సూచించాం. పిల్లలకు పాఠాలు నేర్పుతూనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇది దోహదం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని