logo

273 మంది గైర్హాజరు

పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమభాష పరీక్ష నిర్వహించగా జిల్లాలోని 153 కేంద్రాల్లో 22,424కు గాను 22,151 మంది హాజరుకాగా 273 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు

Published : 24 May 2022 04:17 IST

కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ విద్యావిభాగం : పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమభాష పరీక్ష నిర్వహించగా జిల్లాలోని 153 కేంద్రాల్లో 22,424కు గాను 22,151 మంది హాజరుకాగా 273 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలుకాగా సమయం కంటే ముందే కేంద్రానికి చేరుకున్నారు.
అదే తికమక..
ఏటా జరిగినట్లే కోటగల్లీ ఉన్నత పాఠశాల(బాలికల), కోటగల్లీ ఉన్నత పాఠశాల(శంకర్‌భవన్‌) కేంద్రాల విషయంలో విద్యార్థులు తికమకపడ్డారు.
శంకర్‌భవన్‌లో పరీక్ష రాయాల్సిన వారు కోటగల్లీ బాలికల ఉన్నత పాఠశాలకు వచ్చారు. అధికారుల సాయంతో కొంతసేపటి తర్వాత వారి కేంద్రాలకు చేరుకున్నారు.
 నవీపేట, న్యూస్‌టుడే: నవీపేట బాలుర ఉన్నత పాఠశాలలోని కేంద్రంలో నాలుగు గదుల్లో ఫ్యాన్లు ఉన్నా విద్యుత్తు సరఫరా లేదు. విద్యుత్తు బోర్డులు ధ్వంసమయ్యాయి. గదుల్లో కొన్ని మాములు బల్లలు ఏర్పాటు చేయడంతో పరీక్ష రాయడానికి ఇబ్బంది పడ్డారు.
 భీమ్‌గల్‌, న్యూస్‌టుడే: భీమ్‌గల్‌ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ముచ్కూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌లో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కొన్ని గదుల్లో ఫ్యాన్లు లేవు.

కలెక్టర్‌ తనిఖీలు
పదోతరగతి పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు ఆస్కారం ఉండకూడదని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. నగరంలోని మానిక్‌భవన్‌ ఉన్నత పాఠశాల, కాకతీయ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని