logo

స్వచ్ఛతలో కొంత మెరుగు

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022లో జిల్లాలోని బల్దియాలకు మెరుగైన ర్యాంకులు వచ్చాయి. రెండేళ్ల కన్నా ఈసారి కొంత మెరుగుపడ్డాయి.

Published : 02 Oct 2022 04:51 IST

కామారెడ్డికి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం


కామారెడ్డిలో చెత్త సేకరిస్తున్న పురపాలక సిబ్బంది

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2022లో జిల్లాలోని బల్దియాలకు మెరుగైన ర్యాంకులు వచ్చాయి. రెండేళ్ల కన్నా ఈసారి కొంత మెరుగుపడ్డాయి. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, పర్యవేక్షణ, శౌచాలయాల నిర్వహణ, శతశాతం మరుగుదొడ్ల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల్లో వసతులు, పట్టణాన్ని నందనవనంగా మార్చడం వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం శనివారం ర్యాంకులు ప్రకటించింది. గతంలో కామారెడ్డి బల్దియా జాతీయ ర్యాంకు 168 కాగా ఈసారి 131 వచ్చింది. రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలిచింది. బాన్సువాడ మున్సిపాలిటీకి జోనల్‌ 25, రాష్ట్రస్థాయిలో  22, ఎల్లారెడ్డికి జోనల్‌ 29, రాష్ట్రస్థాయిలో 28 ర్యాంకు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని