logo

పొరుగు సేవల ఉద్యోగాల పేరిట వల

మిషన్‌ భగీరథలో పొరుగుసేవల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు యత్నిస్తున్నారు. చిన్నమొత్తంలో డిపాజిట్‌ చేస్తే ఉద్యోగం ఖరారైనట్లేనంటూ నమ్మబలుకుతున్నారు.

Published : 06 Feb 2023 05:44 IST

అప్రమత్తమైన మిషన్‌ భగీరథ అధికారులు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: మిషన్‌ భగీరథలో పొరుగుసేవల ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు యత్నిస్తున్నారు. చిన్నమొత్తంలో డిపాజిట్‌ చేస్తే ఉద్యోగం ఖరారైనట్లేనంటూ నమ్మబలుకుతున్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఈ సమాచారం బయటకు రావడంతో మిషన్‌ భగీరథ అధికారులు రంగంలోకి దిగారు. తమ శాఖలో ప్రస్తుతానికి ఎలాంటి పొరుగుసేవల ఉద్యోగాలు లేవని పేర్కొంటున్నారు. నిరుద్యోగులు అనవసరంగా మోసపోవద్దని ఆ శాఖ ఎస్‌ఈ రాజేంద్రకుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వెలుగులోకి వచ్చిందిలా..

ఇటీవల కాలంలో గుర్తుతెలియని వ్యక్తులు జిల్లాలోని సర్పంచులకు, మాజీ సర్పంచులకు ఫోన్‌ చేసి తాము మిషన్‌ భగీరథశాఖలో పొరుగుసేవల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెబుతున్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు రూ.2500 డిపాజిట్‌ చేస్తే చాలని సూచిస్తున్నారు. ఉద్యోగంతో పాటు ద్విచక్రవాహన సౌకర్యం కల్పిస్తామంటున్నారు. గాంధారి మండలంలో ఓ ప్రజాప్రతినిధికి ఫోన్‌ వెళ్లడంతో ఆయన సంబంధితశాఖ అధికారులకు ఫోన్‌ చేసి నిజనిర్ధారణ చేసుకున్నారు. కొన్ని వాట్సాప్‌ గ్రూపుల్లోనూ ఈ సమాచారం చక్కర్లు కొడుతోందని గ్రహించిన అధికారులు ఎవరూ డిపాజిట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పొరుగుసేవల ఉద్యోగాల భర్తీ ఉంటే అందరికి తెలిసేలా పత్రిక ప్రకటన ఇస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని