logo

శిక్షణ.. ఆత్మరక్షణ

ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది.

Published : 18 Apr 2024 05:01 IST

వేసవిలో పిల్లలకోసం ఉచిత శిబిరాలు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ క్రీడావిభాగం

ఆత్మరక్షణ క్రీడలు ప్రతిఒక్కరి జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వమే కాక.. మానసికంగానూ బలోపేతమవుతారు. ధైర్యం పెరుగుతుంది.. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువులోనూ చురుగ్గా ఉంటారు. అంతేకాక వీటిల్లో రాణిస్తే ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు శిక్షణ ఇప్పిస్తే వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేసే వీలుంటుంది. వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లోనే ఉంచే బదులు జిల్లాలో నిర్వహించే ఉచిత శిక్షణ శిబిరాలకు పంపిస్తే మేలు జరుగుతుంది.     

జిల్లా నుంచి వందల  మంది క్రీడాకారులు

జిల్లావ్యాప్తంగా మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పించేవారు దాదాపు 120 మంది ఉన్నారు. వీరి వద్ద 1500 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో నుంచి ఏటా రాష్ట్రస్థాయిలో 400 నుంచి 450 మంది ప్రాతినిధ్యం వహించగా.. 250 మంది వరకు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. మీ పిల్లలకు కూడా ఉచిత శిక్షణ ఇప్పించి ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొనేలా చూడండి.


శిబిరాల వివరాలు..

తైక్వాండో

  • మనోజ్‌కుమార్‌
  • ఈ నెల 20 నుంచి మే 25 వరకు
  • వినాయక్‌నగర్‌లోని బస్వా గార్డెన్‌(ఉదయం), గంగాస్థాన్‌-2 రోడ్డు నంబర్‌-6, కాలనీ పార్కు(సాయంత్రం)
  • ఉదయం 6 నుంచి 7 వరకు, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు
  • 79899 58068

శిక్షకుడు  
తేదీ  
స్థలం
సమయం
సంప్రదించాల్సిన నంబరు


ఉషూ

  • అబ్దుల్‌ ఉమర్‌
  • ఈ నెల 25 నుంచి మే 25 వరకు
  • పాత కలెక్టరేట్‌లోని డీఎస్‌ఏ మైదానం (ఉదయం, సాయంత్రం)
  • 6 నుంచి 8 వరకు
  • 88857 77780

కరాటే

  • వెంకటేశ్‌
  • మే 2 నుంచి
  • శివాజీనగర్‌ మున్నూరుకాపు కల్యాణమండపం (ఉదయం),  సుభాష్‌నగర్‌  ఎస్‌ఎఫ్‌ఎస్‌  పాఠశాల మైదానం (సాయంత్రం)
  • 2 5.30 నుంచి 7గంటల వరకు
  • 99084 85999
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని