logo

విరాళాలు పోగు చేసి.. పూడిక తీసుకున్నారు

బీర్కూర్‌లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి.

Published : 18 Apr 2024 05:03 IST

బీర్కూర్‌, న్యూస్‌టుడే : బీర్కూర్‌లోని నల్లజెరు చెరువు తూములో పూడిక పేరుకుపోయి యాసంగిలో పొలాలకు సాగు నీరందక పంటలు ఎండిపోయాయి. ఆ సమయంలో తూములో భారీ నీటి ప్రవాహం ఉండటంతో పూడిక తీసుకోలేదు. పంట కోతలు అయిపోవడంతో నీటి ప్రవాహం తగ్గింది. దీంతో వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయకట్టు కింద ఉన్న 100 మంది రైతులు తలా కొంత నగదు వేసుకుని రూ.లక్ష పోగు చేసుకున్నారు. వాటితో తూములో ఉన్న బండరాళ్లు, మట్టి, చెత్తా చెదారం తొలగించారు. జేసీబీతో తూము వద్ద నుంచి పొలాలకు వెళ్లే పంట కాల్వలో పూడిక తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని