logo

హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 26 Apr 2024 05:57 IST

ప్రసంగిస్తున్న పోచారం

నాగిరెడ్డిపేట్, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో గురువారం జహీరాబాద్‌ భారాస ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించి బస్టాండ్‌ కూడలిలో ప్రసంగించారు. రైతు రుణమాఫీ చేయలేదని, ఆడ పడుచులకు మహాలక్ష్మి పథకం వర్తింపజేయలేదని విమర్శించారు. నాయకులు ప్రతాప్‌రెడ్డి, గుర్రాల సిద్దయ్య, సంజీవరెడ్డి, సంతోష్‌గౌడ్‌, వెంకట్రెడ్డి, నారాయణ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తాం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

 రామారెడ్డి, న్యూస్‌టుడే: ఆగస్టు 15లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. గురువారం రామారెడ్డిలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల్లో ఎంపీగా బీబీపాటిల్‌ చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మాగౌడ్‌, ఎంపీటీసీ సభ్యుడు ప్రవీణ్‌గౌడ్‌, కందూరి లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.


‘కాషాయ జెండా ఎగరాలి’

మాట్లాడుతున్న భాజపా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

ఎల్లారెడ్డి పట్టణం: జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ వేడుకల మందిరంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి నాయకులు, కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ  భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. అనంతరం కార్యకర్తలు లక్ష్మాపూర్‌, అడివిలింగాల్‌ తండాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, నాయకులు దేవేందర్‌, బాలకిషన్‌, తానాజీరావ్‌, నర్సింలు, రాములు, సతీష్‌, నరేష్‌, సాయికిరణ్‌, పొచయ్య రామకృష్ణ,  గణేష్‌, నరేష్‌నాయక్‌, రాజు తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని