logo

‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’

భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు.

Published : 30 Apr 2024 05:55 IST

మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ, పక్కన ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌
దోమకొండ, న్యూస్‌టుడే: భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌, అల్లుడు హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కోట్ల రూపాయలను దండుకున్నారని, ఆ ప్రాజెక్టంతా సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్ల చుట్టూ తిరిగిందే తప్ప కరవు ప్రాంతాలను ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు. సోమవారం దోమకొండలో మండల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ మాట తప్పారని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు ఇళ్లు, ముస్లిం, బంజారాల రిజర్వేషన్లు వంటి హామీలను వారు మరిచారని పేర్కొన్నారు. ఆగస్టు 15లోపు రూ.రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని, ప్రభుత్వం తరఫున భరోసా ఇస్తున్నామన్నారు. రుణమాఫీ కాకపోతే మా ఇళ్ల వద్ద ధర్నా చేయండని అన్నారు. ఎన్నికల తర్వాత దోమకొండలోని ఆసుపత్రిని వంద పడకలకు మార్చుతామని హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ మాట్లాడుతూ.. పదేళ్ల పాటు ఎంపీగా కొనసాగిన బీబీపాటిల్‌ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, ఆయన గుత్తేదారు పనులనే చేసుకున్నారని అన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఉపాధి హామీ రోజు కూలి రూ.400 ఇస్తామని అన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని