logo

పదిలో కాస్త తడబడి

జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది.

Published : 01 May 2024 05:20 IST

రాష్ట్రస్థాయిలో జిల్లాకు 19వ స్థానం
92.71 శాతం ఉత్తీర్ణత.. 132 మందికి 10 జీపీఏ
కామారెడ్డి పట్టణం- న్యూస్‌టుడే

జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. 2020లో కొవిడ్‌ కారణంగా రెండేళ్లు ప్రత్యక్ష తరగతుల నిర్వహణ సక్రమంగా సాగలేదు. దీంతో రెండు విద్యాసంవత్సరాల్లో విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా వంద శాతం విద్యార్థులను ఉత్తీర్ణుల్ని చేశారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపింది. గతేడాది నుంచి ఫలితాల్లో ఉత్తీర్ణతశాతంలో స్వల్ప తేడాతో ర్యాంకు పడిపోయింది. ఈ సారి 132 మందికి 10 జీపీఏ ఫలితాలు వచ్చాయి. అందులో ప్రైవేటు 85, ప్రభుత్వ 47 మంది ఉన్నారు.

బాలికలదే పైచేయి

ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ సారి బాలురు 5879కి 5351(91.02 శాతం), బాలికలు 6047కి 5706 (94.36 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది బాలురు 92.39, బాలికలు 94.26 శాతం మెరుగైన ఫలితాలు సాధించారు.

869 మంది అనుత్తీర్ణత

జిల్లాలో ఆయా మండలాల పరిధిలో గతేడాది 792 అనుత్తీర్ణత చెందగా ఈ సారి 869 మంది ఉన్నారు. బాన్సువాడ మండలంలో 141, భిక్కనూరులో 30, బీబీపేటలో 20, బిచ్కుందలో 70, బీర్కూర్‌లో 9, దోమకొండలో 7, గాంధారిలో 85, జుక్కల్‌లో 10, కామారెడ్డిలో 112, లింగంపేటలో 30, మాచారెడ్డిలో 25, మద్నూర్‌లో 93, నాగిరెడ్డిపేటలో 43, నస్రుల్లాబాద్‌లో 34, నిజాంసాగర్‌లో 7, పెద్దకొడప్‌గల్‌లో 1, పిట్లంలో 28, రాజంపేటలో 11, రామారెడ్డిలో 26, సదాశివనగర్‌లో 10, తాడ్వాయిలో 22 ఎల్లారెడ్డిలో 55 మంది వివిధ సబ్జెక్టుల్లో అనుత్తీర్ణులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని