logo

సీఎం ప్రజలను మోసం చేస్తున్నారు: పోచారం

సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ అక్కడున్న దేవుళ్లపై ఒట్లు పెడ్తు ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

Published : 04 May 2024 22:04 IST

బీర్కూర్: సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ అక్కడున్న దేవుళ్లపై ఒట్లు పెడ్తు ప్రజల్ని మోసం చేస్తున్నారని మాజీ సభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి బీర్కూర్‌ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చాలేదన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతాయని జోస్యం చెప్పారు. రెండు పడక గదులు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రావాల్సిన రూ.26 కోట్ల బిల్లులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి నిలిపివేశారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను బెదిరించి బలవంతంగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు, మద్యం, ఇసుక, ఇతరత్రా వ్యాపారాలు జరగాలంటే కాంగ్రెస్‌ కండువా కప్పుకోవాలని దాబయిస్తున్నారని చెప్పారు. గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. భారాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోచారం భాస్కర్‌ రెడ్డి, ఎంపీపీ రఘు, సందీప్, శశికాంత్, రాజు, రఘు, ఆరీఫ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని