logo

పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి

ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు.

Updated : 05 May 2024 13:49 IST

కామారెడ్డి పట్టణం: ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆదర్శనగర్, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల వివరాలను బూతు లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు చూడాలని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీవో రఘునాథరావు, నోడల్ అధికారి రఘునాథ్, బూతు లెవ‌ల్ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని