logo

‘కాంగ్రెస్‌కు చేనేత కార్మికుల కష్టాలు పట్టవు’

కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు.

Published : 08 May 2024 06:30 IST

మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేనేత కార్మికుల కష్టాలు ఏ మాత్రం పట్టవని నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి పద్మశాలి కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. భారాస హయాంలో ఏటా బతుకమ్మ చీరల తయారు చేయించడం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వీటిని నిలిపివేయడంతో పాటు బీడీ, చేనేత కార్మికులకు పింఛన్‌ ఇవ్వడం లేదన్నారు. పేదింటి ఆడపిల్లకు పెళ్లి ఖర్చుల నిమిత్తం కల్యాణ లక్ష్మి ద్వారా తాము సాయం అందిస్తే.. దాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పద్మశాలీలను ఆదుకున్నది కేసీఆర్‌ మాత్రమేనని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. అర్బన్‌ నియోజకవర్గంలో పద్మశాలి సంఘాలకు రూ.8 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశామన్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ రంగం కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, పద్మశాలి సంఘం నగర అధ్యక్షుడు వెంకటనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మురళి, ప్రతినిధులు సత్యపాల్‌, హన్మాండ్లు, గుండయ్య, యాదగిరి, ధర్మపురి, మహేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని