logo

ఓటరు చైతన్య కరపత్రాల ఆవిష్కరణ

లోక్ సభ ఎన్నికల సందర్భంగా "ఆగండి కొంచెం ఆలోచించండి " అని ఓటర్లను చైతన్యం చేసే విధంగా కరపత్రాన్ని కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్, మహిళా వేదిక, జలసాధన సమితి, అధ్యయన వేదిక సంయుక్తంగా బుధవారం విడుదల చేశారు.

Published : 08 May 2024 19:27 IST

కామారెడ్డి పట్టణం: లోక్ సభ ఎన్నికల సందర్భంగా "ఆగండి కొంచెం ఆలోచించండి " అని ఓటర్లను చైతన్యం చేసే విధంగా కరపత్రాన్ని కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్, మహిళా వేదిక, జలసాధన సమితి, అధ్యయన వేదిక సంయుక్తంగా బుధవారం విడుదల చేశారు. పోటీ చేసే రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు, గత కార్యాచరణ, పోటీదారుల చరిత్ర తెలుసుకొని, ప్రజలు నిర్దిష్టంగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. మైకులు, ఊరేగింపులు, వాగ్దానాల వరదలు, బహిరంగ సభలు, తాయిలాలు, పథకాలు, ప్రలోభాలకు ప్రజలను గురి చేసి ఓట్లు దండుకునే విధంగా నేటి ఎన్నికల ప్రచారం ఉందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.జగన్నాథం, సీపీఐ సీనియర్ నాయకుడు వి.ఎల్.నర్సింహారెడ్డి, ఏసీటీఎఫ్‌ పూర్వ అధ్యక్షుడు కె.వేణుగోపాల్, కె.రమణ, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని