icon icon icon
icon icon icon

CM Revanth Reddy speech at Armour: పసుపుబోర్డు పేరు చెప్పి ఎన్నాళ్లీ మోసం?: సీఎం రేవంత్‌రెడ్డి

పంజాబ్‌, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్‌ ఆర్మూర్‌ రైతులు అదేబాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. 

Published : 08 May 2024 20:38 IST

ఆర్మూర్‌: పంజాబ్‌, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్‌.. ఆర్మూర్‌ రైతులు అదేబాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో భాజపా, భారాసపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను ఆ తర్వాత కవిత మరిచారని విమర్శించారు. పసుపుబోర్డు తెస్తానని చెప్పిన ధర్మపురి అర్వింద్‌ కూడా మోసం చేశారన్నారు. 2019లో రాజ్‌నాథ్‌సింగ్‌ను తీసుకొచ్చి పసుపుబోర్డుపై ప్రకటన చేయించిన అర్వింద్‌, ఇప్పుడు మోదీని తీసుకొచ్చి మళ్లీ అదే మాట చెప్పించారని ఎద్దేవా చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మోదీ ఇలాగే హామీ ఇచ్చి కాలయాపన చేస్తారా? అని ప్రశ్నించారు. జీవన్‌రెడ్డిని గెలిపిస్తే ఆర్మూర్‌ను అభివృద్ధిపథంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రూ.42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేశామని సీఎం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img