logo

నిఘా నీడన ఎన్నికలు

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది.

Published : 09 May 2024 03:07 IST

1,808 పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల బిగింపు
నిరంతర పర్యవేక్షణకు కంట్రోల్‌ రూం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా అల్లర్లు జరగకుండా గట్టి నిఘా పెట్టింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో 1,808 పోలింగ్‌ కేంద్రాల్లో 2,507 సీసీ కెమెరాలు బిగించి గట్టి  నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి కోసం 1,808 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం నిరంతర పర్యవేక్షణ కోసం కేంద్రాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. 171 సమస్మాత్మక ప్రదేశాల్లో 506 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు.  ఆయా చోట్ల లోపల, బయట రెండు చొప్పున కెమెరాలు బిగించనున్నారు.

అధికారుల పర్యవేక్షణ

పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను ఎప్పుటికప్పుడు చూసేందుకు వీలుగా నిజామాబాద్‌ కలెక్టరేట్‌తో పాటు సహాయ ఎన్నికల అధికారి కార్యాలయాలైన నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, బోధన్‌, ఆర్మూర్‌, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేస్తారు. జిల్లాకు వచ్చిన సాధారణ, పోలీసు పరిశీలకులతో పాటు రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ తీరును వీక్షిస్తారు. ఘర్షణలు చోటు చేసుకుంటే పోలీసు బలగాలను పంపిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని