logo

ప్రతినబూనుతున్నాం.. అమ్మానాన్నకు చెబుతాం

అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు.

Updated : 10 May 2024 06:20 IST

అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు. పోలింగ్‌ రోజున ఓటు వేయాలంటే ఊర్లకు వెళ్లొద్దని.. ఇంటి వద్దే ఉండాలని కోరారు. తాము ఒక్కరం వేయకుంటే ఏమవుతుందనే నిర్లక్ష్యం వద్దని, ఆ ఒక్క ఓటే గెలుపోటములు నిర్ణయిస్తుందని పేర్కొంటున్నారు. నిజామాబాద్‌ బాలభవన్‌లో కొనసాగుతున్న ప్రత్యేక వేసవి శిక్షణ శిబిరంలో    పాల్గొంటున్న చిన్నారులు గురువారం తమ అమ్మానాన్నలతో తప్పకుండా ఓటు వేయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పర్యవేక్షకులు ప్రభాకర్‌, సిబ్బంది వారిని అభినందించారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం


ప్రలోభాలకు లొంగితే శిక్ష

ఎన్నికల వేళ డబ్బు, మద్యం, క్రికెట్‌ కిట్లు, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తుంటారు. ప్రలోభపెట్టే సమయంలో నాయకులు, అభ్యర్థులు పట్టుబడితే వారిపై కేసు నమోదు చేస్తారు. ప్రలోభాలకు లొంగి వారిచ్చిన సామగ్రిని సేకరించినా నేరమే అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951 సెక్షన్‌ 123 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేసు నమోదై కోర్టులో నిరూపణ అయితే జైలుశిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయి.  

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని