logo

జీవన్‌రెడ్డి మాల్‌కు నోటీసులు

ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్‌రెడ్డి మాల్‌కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు.

Published : 10 May 2024 02:42 IST

ఆర్మూర్‌లోని జీవన్‌ రెడ్డి మాల్‌లో మైకుతో ప్రకటన చేస్తున్న ఆర్టీసీ అధికారులు

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్‌రెడ్డి మాల్‌కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. రూ.3.14 కోట్ల అద్దె బకాయిల చెల్లింపు విషయమై గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్‌ రీజియన్‌ విజిలెన్స్‌, సెక్యూరిటీ అధికారి బాబురావు, డిప్యూటీ ఆర్‌ఎం శంకర్‌, ఆర్మూర్‌ డీఎం ఆంజనేయులు మరోసారి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ‘‘ఆర్టీసీ స్థలంలో జీవన్‌ రెడ్డి మాల్‌ పేరుతో నిర్మించిన విశ్వజిత్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రైవేటు సంస్థ అద్దె బకాయిలు చెల్లించడం లేదని, ఇందులోని కిరాయి దారులు గమనించాలని, అద్దె బకాయిలు గడువులోగా చెల్లించకపోవడంతో స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించినట్లు’’ మైకులో ప్రకటించారు. సాయంత్రం వరకు గడువు ఇవ్వగా, సంబంధిత సంస్థ ప్రతినిధులు బకాయిల చెల్లింపులపై ముందుకు రావడంతో సీజ్‌ చేసే నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు