logo

రథయాత్రను గుర్తించాలని ‘యునెస్కో’కు ప్రతిపాదన

విశ్వప్రసిద్ధ పూరీ రథయాత్రను ‘యునెస్కో’ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2023లోని జరిగే యాత్ర నాటికి ఈ హోదా లభించేలా సన్నాహాలు చేస్తోంది.

Published : 28 Nov 2022 01:21 IST

విశ్వప్రసిద్ధ రథయాత్ర (పాతచిత్రం)

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: విశ్వప్రసిద్ధ పూరీ రథయాత్రను ‘యునెస్కో’ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2023లోని జరిగే యాత్ర నాటికి ఈ హోదా లభించేలా సన్నాహాలు చేస్తోంది. గుర్తింపునకు అవసరమైన నియమావళి, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసి, యునెస్కోకు లేఖ రాసేందుకు మాధవ మహాపాత్ర్‌, దుర్గాప్రసాద్‌ దాస్‌ మహాపాత్ర్‌, అనంత తియాడి, మాధవచంద్ర పూజాపండ, మొటు సింహారీలు, ఇద్దరు మఠాధీశులు రామకృష్ణదాస్‌ మహారాజ్‌, సచ్చిదానందదాస్‌ మహాపాత్ర్‌లతో శ్రీక్షేత్ర యంత్రాంగం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ జాబితాను పాలక వర్గం త్వరలో రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖకు పంపించనుంది. శాఖ ఆమోదం తెలిపిన అనంతరం అక్షయ తృతీయ స్నానపౌర్ణమి, రథయాత్ర, సున్నాభెషో, నీలాద్రి బిజె వేడుకలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు, ఇతర వివరాల సంపుటిని ‘యునెస్కో’కు సమర్పిస్తారు. దాంతోపాటు రథయాత్ర ప్రపంచ సాంస్కృతిక యాత్రగా గుర్తించాలని ప్రతిపాదించనున్నారు.

గొప్ప గౌరవం

జగన్నాథ భక్తుడు, పండిత సూర్యనారాయణ రథశర్మ ఆదివారం ‘న్యూస్‌టుడే’తో ఫోన్‌లో మాట్లాడుతూ... యునెస్కో గుర్తిస్తే గొప్ప గౌరవమన్నారు. శ్రీక్షేత్ర పాలక కమిటీ కొన్నేళ్లుగా ‘యునెస్కో’తో సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని