logo

కొడుకు జైలులో.. తల్లిదండ్రులు భిక్షాటన

వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుక్ను కొడుకు జైలుకు వెళ్లడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Published : 30 Jan 2023 02:17 IST

వంశీధర్‌, ప్రమీల దంపతులు

జయపురం, న్యూస్‌టుడే:  వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుక్ను కొడుకు జైలుకు వెళ్లడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... జయపురం సమితి బడకెరంగ పంచాయతీ కొలాబ్‌ నగర్‌ గ్రామానికి చెందిన వంశీధర్‌ బొత్ర, ప్రమీల నియాల్‌కు ఒక్కడే కుమారుడు అతడిని మూడేళ్ల క్రితం పోలీసులు అరెస్టు చేసి విశాఖపట్నం సెంట్రల్‌ జైలుకు తరలించారు. ప్రమీల అంధురాలు కావడం, వంశీధరకు వృద్ధాప్యం కారణంగా గ్రామాల్లో ఎలాంటి పని దొరక లేదు. రేషన్‌ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. దీంతో పొట్ట నింపుకొనేందుకు యాచక వృత్తిని ఎంచుకున్నారు. పలుమార్లు సర్పంచ్‌ వద్దకు వెళ్లి రేషన్‌ కార్డు గురించి అడిగామని, కొడుకు ఖైదీ కావడంతో మంజూరు చేసేందుకు నిరాకరించారని వాపోయారు. ప్రభుత్వం తరఫున పింఛను, బియ్యం అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని