logo

దిగి రాకుంటే పరిశ్రమ గేటుకు తాళాలు వేస్తాం

కాశీపూర్‌ సమితి దొరాగుడ ఉత్కళ అల్యూమినా పరిశ్రమ వారికి గత నెల 15వ తేదీన 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించినప్పటికీ నేటికీ ఎలాంటి స్పందన రాలేదని డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌ పండా అన్నారు.

Published : 02 Feb 2023 02:27 IST

సమావేశంలో మాట్లాడుతున్న దుర్గాప్రసాద్‌. చిత్రంలో అస్లాం, అంగదో తదితరులు

రాయగడ, న్యూస్‌టుడే : కాశీపూర్‌ సమితి దొరాగుడ ఉత్కళ అల్యూమినా పరిశ్రమ వారికి గత నెల 15వ తేదీన 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించినప్పటికీ నేటికీ ఎలాంటి స్పందన రాలేదని డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్‌ పండా అన్నారు. ఇప్పటికైనా స్పందించకుంటే ఈ నెల 6న దొరాగుడ పరిశ్రమ ప్రధాన గేటు వద్ద భారీ ఆందోళన చేయడమే కాకుండా, గేట్లకు తాళం వేస్తామని హెచ్చరించారు. బుధవారం  స్థానిక ప్రజా పనులశాఖ ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి, నైపుణ్య శిక్షణ వంటివి కల్పించాలని కోరారు. న్యాయం జరగాలని ప్రశ్నించిన ఒండ్రా కంచి గ్రామానికి చెందిన గర్భవతిని పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలకు గురిచేయడంతో ఆమె మరణించిందని ఆరోపించారు. బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స్పందించకుంటే పరిశ్రమకు ముడి సరకు అందకుండా రవాణా స్తంభింపచేస్తామన్నారు. కార్యక్రమంలో కాశీపూర్‌ సమితి పార్టీ అధ్యక్షులు అంగదో నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని