logo

నాడు బిజద.. నేడు భాజపా

రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్‌లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

Published : 27 Apr 2024 05:49 IST

గుణుపురం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్‌లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గుణుపురం భాజపా అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన త్రినాథ్‌ గమాంగ్‌ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత మొదట కాంగ్రెస్‌లో చేరారు. ఆయన అక్క హేమా గమాంగ్‌ కొరాపుట్ ఎంపీగా, గుణుపురం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె వెన్నంటే ఉండేవారు. 2014 ఎన్నికల్లో త్రినాథ్‌ కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. అవకాశం రాకపోవడంతో బిజదలో చేరారు. ఆ ఏడాది శంఖం తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2019లో త్రినాథ్‌కు బిజద టికెట్‌ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం భాజపాలో చేరి పోటీ చేస్తున్నారు.

అందరికీ తెలిసిన వ్యక్తి: జగన్నాథ్‌ నుండ్రుకా బిసంకటక్‌ నియోజకవర్గంలో అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన ఏక్తా పరిషత్‌ సంస్థలో సభ్యునిగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. తరువాత రాజకీయ రంగప్రవేశం చేసి, బిజదలో చేరారు. ఆ పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నారు. మునిగుడ సమితి సర్దాపూర్‌ పంచాయతీలో సమితి సభ్యునిగా, దొహిఖల్‌ పంచాయతీలో సమితి సభ్యునిగా, సర్పంచిగా చేశారు. గత ఎన్నికల్లో ఆయన భార్య సమితి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తరువాత నుండ్రుకా కోపరేటివ్‌ బ్యాంక్‌ డైరక్టర్‌గా చేశారు. జిల్లా ప్రత్యేక మండలి అధ్యక్షుడిగా కొన్ని నెలలు చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో కమలదళంలో చేరారు. బిసంకటక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని