logo

5 లోక్‌సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్‌, బొలంగీర్‌, బరగఢ్‌, సుందర్‌గఢ్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Published : 27 Apr 2024 05:55 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్‌, బొలంగీర్‌, బరగఢ్‌, సుందర్‌గఢ్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మే 3 వరకు కొనసాగనుంది. 4న పరిశీలన, 6న ఉపసంహరణ జరగనుంది.

అసెంబ్లీకి 266 మంది

తొలివిడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. కొరాపుట్‌ లోక్‌సభ స్థానంలో అత్యధికంగా 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బ్రహ్మపుర, కలహండి స్థానాల్లో 11 మంది చొప్పున, నవరంగపూర్‌కు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల పరిధుల్లో 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 266 మంది నామినేషన్లు వేశారు. బ్రహ్మపుర శాసనసభ బరిలో అత్యధికంగా 20 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని