logo

గోపాల్‌పూర్‌ ఓడరేవు కొనుగోలు చేసిన అదానీ

తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్‌పూర్‌ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది

Published : 29 Mar 2024 07:24 IST

 

గోపాల్‌పూర్‌ ఓడరేవు

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: తూర్పు తీరంలో సరకు రవాణాలో అగ్రగామిగా ఉన్న గోపాల్‌పూర్‌ ఓడరేవును ప్రముఖ పారిశ్రామిక గ్రూపు అదానీ కొనుగోలు చేసింది. మంగళవారం ముంబయిలో జరిగిన కార్యక్రమంలో రూ.3,080 కోట్లు వెచ్చించి పోర్టును తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇంతవరకు ఈ ఓడరేవు సర్పూజీ పలోంజీ గ్రూపు ఆధ్వర్యంలో ఉన్న సంగతి విదితమే. ఇటీవల కాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సంస్థ పోర్టును వదులుకోవడానికి నిర్ణయించింది. గోపాల్‌పూర్‌ పోర్ట్స్‌ లిమిటెడ్‌ (జీపీఎల్‌)లో సర్పూజీ పెట్టుబడులు 56 శాతం, ఒడిశా స్టీవెడర్స్‌ లిమిటెడ్‌ (ఓఎస్‌ఎల్‌) పెట్టుబడులు 39 శాతం కాగా, అదానీ గ్రూపు సంస్థ 95 శాతం కొనుగోలు చేసి తనపరం చేసుకుంది. మిగిలిన 5 శాతం ఒడిశా ప్రభుత్వ వాటా ఉంటుంది. ఈ ఓడరేవు ఏడాదిలో 20 మిలియన్‌ టన్నుల సరకు రవాణా సామర్థ్యం కలిగుంది. 16వ నెంబరు జాతీయ రాహదారి టాటా సెజ్‌, ఐఆర్‌ఈ కంపెనీకి చేరువలో ఉన్న గోపాల్‌పూర్‌ ఓడరేవును ఇటీవల కాలంలో విస్తరించారు. దీన్ని అదానీ సొంతం చేసుకోవడంతో సామర్థ్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో టాటా కంపెనీ ఆధ్వర్యంలోని భద్రక్‌ జిల్లా ధమ్రా ఓడరేవును అదానీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని