logo

నిన్న నువ్వా, నేనా... నేడు నువ్వే నేను

‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్‌సభ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి, గోపాల్‌పూర్‌ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్‌ జెనా ప్రచారం చేస్తున్నారు.

Published : 30 Apr 2024 04:57 IST

 రొంఢా గ్రామంలో కలసి ప్రచారం చేస్తున్న ప్రదీప్‌, బిభూతి

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: ‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్‌సభ అభ్యర్థి ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి, గోపాల్‌పూర్‌ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్‌ జెనా ప్రచారం చేస్తున్నారు. గతసారి ఎన్నికల్లో వీరిద్దరూ కత్తులు దూసుకున్నారు. ప్రదీప్‌ బిజద తరఫున, బిభూతి భాజపా అభ్యర్థిగా గోపాల్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. బిభూతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, మిత్రులుండరన్న సత్యానికి నిదర్శనంగా ఈసారి వీరిద్దరూ ఒకే పార్టీ (కమలం) అభ్యర్థులుగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో పాదయాత్రలు చేసి ఓట్లడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు