logo

పాఠశాలలో చేరడానికి విద్యార్థులకు తప్పని తిప్పలు

ప్రాథమిక, ఉన్నత విద్యకు ఏ విద్యార్ధి దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు రూపొందించాయి.

Published : 06 May 2024 17:00 IST

నవరంగ్‌పూర్‌: ప్రాథమిక, ఉన్నత విద్యకు ఏ విద్యార్ధి దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు రూపొందించాయి. కొంతమంది ప్రధానోపాధ్యాయుల స్వార్థంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు విఫలమవుతున్నాయి. అలాంటి ఘటన కోరాఫుట్ జిల్లా పాఠశాలలో జరిగింది. బొరిగుమ్మ సమితి గుముడ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతిలో చేరేకుందు నకుల్, అతని తండ్రి తపన్ వెళ్లారు. పాఠశాలలో సీట్లు లేవని వారిని ఉపాధ్యాయులు పంపించారు. అనంతరం  నకుల్‌ గతంలో చదివిన పాఠశాలలో ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ తీసుకొస్తే ఈ పాఠశాలలో 7వ తరగతిలో చేర్పిస్తామని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని