logo

పగటి కలలు కంటున్న భాజపా: సీఎం

విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు.

Updated : 07 May 2024 06:49 IST

జూన్‌ 9న నవీన్‌ ప్రమాణ స్వీకారమన్న పాండ్యన్‌

ప్రసంగిస్తున్న నవీన్‌. పక్కన పాండ్యన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. సోమవారం కలహండి జిల్లాలోని భవానీపాట్నా, నువాపడ జిల్లాలోని ఖరియార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, పేదలకు ప్రోత్సాహకాలు, మహిళల వికాసానికి ‘మిషన్‌శక్తి’ ప్రవేశ పెట్టింది తమ ప్రభుత్వమన్నారు. ఎన్నికల సమయంలో మొసలి కన్నీరు కార్చే విపక్షాలను ప్రజలు విశ్వసించొద్దన్నారు. దేశానికి తలమానికంగా నిలుస్తున్న బీఎస్‌కేవై కార్యక్రమంపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. గర్భిణులకు మమతా, అన్నదాతలకు కాలియా, బలరాం, అంత్యక్రియలకు హరిశ్చంద్ర అమలు చేస్తున్నామని, విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నామన్నారు.  శ్రీజగన్నాథ్‌ కారిడార్‌, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు, మఠాల పునరుద్ధరణ పనులు చేయించామన్నారు. లక్ష్మీ బస్సులు గ్రామీణ ప్రజల రాకపోకలకు ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు.

ఆరోసారి సీఎం అవుతారు: వి.కార్తికేయ పాండ్యన్‌ మాట్లాడుతూ... నవీన్‌ ఆరోసారి ముఖ్యమంత్రి అవుతారని, జూన్‌ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. జనం కోసం పనులు చేస్తున్నది బిజద అని, నాలుగున్నర కోట్ల మందికి ఆశాకిరణంగా నవీన్‌ ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో దిల్లీ నుంచి (కేంద్రం) పెద్దలు రాష్ట్రానికి దిగుతారని, తర్వాత వారు కనిపించరన్నారు. రాష్ట్ర ప్రజల సుఖదుఃఖాల్లో, విపత్తుల్లో ఆదుకుంటున్నది నవీన్‌ మాత్రమేనని, ఆయనను ఓటర్లు మరవకూడదన్నారు. ఈ నెల 13న కలహండి, నువాపడ ప్రాంతాల్లో పోలింగ్‌ జరగనుండగా, దీన్ని పండగలా భావించి అందరూ పోలింగ్‌ కేంద్రాలకు రావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని