logo

బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర

రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్‌ రిమోట్‌ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

Published : 08 May 2024 01:12 IST

ఢెంకనాల్‌ లోక్‌సభ అభ్యర్థి రుద్రనారాయణ పాణితో కలసి కామాక్ష్యనగర్‌లో ధర్మేంద్ర రోడ్‌షో
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్‌ రిమోట్‌ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. మంగళవారం ఉదయం ఝార్సుగుడలో జరిగిన కార్యక్రమంలో కొంతమంది బిజద నాయకులు కేంద్రమంత్రి సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాతృభాష (ఒడియా) రాని సీఎంకు రాష్ట్ర భౌగోళిక స్వరూపం, సంస్కృతి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ప్రజలకు దూరంగా ఉంటున్న ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా లేరని, రిమోట్‌ పాలన రాష్ట్రానికి పట్టిన దుర్గతి అని అభివర్ణించారు. భాజపా అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరని అడుగుతున్న బిజద పెద్దలకు ప్రధాని నరేంద్రమోదీ సమాధానం చెప్పారని, ఒడియా మాట్లాడగలిగే వ్యక్తి సీఎం అవుతారని స్పష్టం చేశారన్నారు. బిజద ఇప్పుడు ఆరిపోతున్న దీపమని, తూర్పు దిక్కున సూర్యుని మాదిరి భాజపా పొడుచుకొంటూ వస్తోందని ధర్మేంద్ర చెప్పారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని