logo

ఉమ్మరికోట్‌లో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పర్యటన

అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఛత్తిస్‌గఢ్‌ సీఎం అన్నారు. సీఎం నవీన్ పట్నాయక్‌ పాలనలో అధికారులు ప్రజలకు సేవలు చేయటంలో నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారి నవరంగపూర్ జిల్లా ఉమ్మారికోట్‌లో బుధవారం జరిగిన భాజపా బహిరంగ సమావేశంలో హాజరైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణదేవ్ సాయి అన్నారు.

Published : 08 May 2024 18:02 IST

నవరంగ్‌పూర్‌: అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఛత్తిస్‌గఢ్‌ సీఎం అన్నారు. సీఎం నవీన్ పట్నాయక్‌ పాలనలో అధికారులు ప్రజలకు సేవలు చేయటంలో నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారి నవరంగపూర్ జిల్లా ఉమ్మారికోట్‌లో బుధవారం జరిగిన భాజపా బహిరంగ సమావేశంలో హాజరైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణదేవ్ సాయి అన్నారు. ఈ సారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 25 ఏళ్లుగా  ఎటువంటి అభివృద్ధి జరగలేదని, నేటికీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి, విద్య, విద్యుత్, రహదారుల సమస్యలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వాల పాలనలో వ్యత్యాసాలను గుర్తించాలని కోరా అన్నారు. భాజపా ఎంపీ అభ్యర్ధి బలభద్ర మాఘుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులను గెలపించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని