logo

నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్‌

చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 10 May 2024 03:10 IST

చిన్నారులతో ప్రచారం. ఇంటింటా వివరాల సేకరణ

ఓ ఇంటి వద్ద ఓటు కార్డు వివరాలు సేకరిస్తున్న యువతి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మే 5న అన్ని రాజకీయపార్టీలకు సూచనలిచ్చింది. రాయగడలో కాంగ్రెస్‌ పార్టీ ఈ నిబంధనలను గాలికొదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా కేంద్రంలో 23వ వార్డు పరిధి అంజయ్యపేటలో కాంగ్రెస్‌ పార్టీ చిన్నారులతో ప్రచారం చేయించడం, ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటింటా ఓటరు గుర్తింపు కార్డుల వివరాలు సేకరించడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఓ యువతి ప్రతి ఇంటికీ వెళ్లి ఓటరు గుర్తింపు కార్డులు అడుగుతూ ఆ వివరాలను ఓ పుస్తకంలో నమోదు చేసుకుంటోంది. ఆమె పక్కన మరో 14  ఏళ్ల బాలుడు కొరాపుట్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న సప్తగిరి ఉలక ఫోటోతో ఉన్న కార్డులు చేతిలో పట్టుకొని ఉన్నాడు. వీడియో తీసిన వ్యక్తి మీరు ఎవరని ప్రశ్నించగా ‘సార్‌ పంపారు’ అని బదులిస్తూ అక్కడి నుంచి జారుకుంది. పక్కన ఉన్న బాలుడిని వయసెంత అని ప్రశ్నించగా 14 ఏళ్లు అని చెప్పాడు. దీనిపై మిగతా రాజకీయ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సప్తగిరి ఉలక ఫోటో ఉన్న కార్డుతో బాలుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని