logo

‘రాష్ట్రంలో మాఫియా పాలన’

ప్రజా సంక్షేమాన్ని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా మారి పరిపాలన సాగిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ ఆరోపించారు. ప్రజాపోరు యాత్రను పార్వతీపురం పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఇసుక, భూములను వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Published : 26 Sep 2022 03:34 IST

సమావేశంలో మాట్లాడుతున్న సునీల్‌ దేవధర్‌, పక్కన నాయకులు

పార్వతీపురం పురపాలక, గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమాన్ని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా మారి పరిపాలన సాగిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ ఆరోపించారు. ప్రజాపోరు యాత్రను పార్వతీపురం పట్టణం, మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఇసుక, భూములను వైకాపా నాయకులు ఆక్రమిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్ర నిధులు వినియోగించి ప్రధాని మోదీ చిత్రాన్ని రాష్ట్రం విస్మరించడం సముచితం కాదన్నారు. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ అన్న ప్రజలు  మూడున్నరేళ్లకే పోవాలి జగన్‌ అనేలా అధ్వాన పాలన సాగుతోందన్నారు. గ్రామాల్లో పాస్టర్లకు జీతాలు ఇస్తూ వారితో మతమార్పిడికి వైకాపా పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో జనసేనతో కలసి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, నాయకులు ఎన్‌.జయరాజ్‌, కె.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని