logo

20,569 మంది హాజరు

కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా ప్రాథమిక రాత పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

Published : 23 Jan 2023 03:18 IST

ప్రశాంతంగా జిల్లాలో కానిస్టేబుల్‌ నియామక రాతపరీక్ష

సిబ్బందితో చర్చిస్తున్న ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: కానిస్టేబుళ్ల ఎంపికలో భాగంగా ప్రాథమిక రాత పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20,569 మంది అభ్యర్థులు రాగా.. 1,057 మంది గైర్హాజరయ్యారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సౌకర్యార్థం జేఎన్‌టీయూ కూడలి వద్ద రెండు బస్సులను పెట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఉచితంగా జేఎన్‌టీయూకు పంపించారు. సీతానగరం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బొబ్బిలి కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా, పొరపాటున జేఎన్‌టీయూకు వచ్చేశాడు. అప్పటికే సమయం మించిపోవడంతో స్థానికంగా రాసే అవకాశం ఇవ్వాలని అధికారులను కోరగా, అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం తమకు లేదని వెనక్కి పంపించేశారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తనిఖీలు చేస్తున్న సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని