logo

సార్వత్రిక పరీక్షలకు సిద్ధం

జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది.

Published : 02 Apr 2023 05:53 IST

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది. సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాలపై డీఈవో రమణ దృష్టి సారించారు. అభ్యర్థుల హాల్‌టికెట్లు అంతర్జాలంలో ఉన్నాయని, డౌన్‌లోడు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్‌ ఠాణాల్లో భద్రపరిచామని డీఈవో చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య శిబిరం, బల్లలు తదితర సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.  

ఇవీ వివరాలు

పరీక్ష తేదీలు: ఈ నెల 3 నుంచి 17 వరకు
కేంద్రాలు: పాలకొండ, సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, భద్రగిరి పీటీజీ, పార్వతీపురం డీవీఎంఎం పాఠశాల.
ఇంటర్మీడియట్‌: పార్వతీపురం కేపీఎం,  వీరఘట్టం జడ్పీ బాలికల పాఠశాల
సమయం: మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు.
హాజరు కానున్న వారు: ఇంటర్మీడియట్‌-480, పది-751 మంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని