logo

చెరువులో చేపల మృత్యువాత

మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జడ్‌.కుమరాం గ్రామ చెరువులో రూ.లక్ష విలువైన చేపలు ఒక్క్కొటిగా చనిపోయాయి. వివరాల్లోకి వెళ్తే..

Published : 28 May 2023 02:29 IST

తేలిన చేపలు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ జడ్‌.కుమరాం గ్రామ చెరువులో రూ.లక్ష విలువైన చేపలు ఒక్క్కొటిగా చనిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. చెరువును స్థానికుడు యడ్ల నాయుడు మూడు సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. ఇందులో రూ.లక్ష విలువైన చేప, రొయ్య పిల్లలను వేశారు. ఇప్పుడిప్పుడే చేపలు పెరుగుతుండడంతో తీసి విక్రయించాలని సిద్ధపడుతున్నారు. అయితే గత రెండు రోజులుగా చేపలు చనిపోతుండడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం చెరువులో చేపలన్నీ చనిపోయి తేలిపోయాయి. వీటిలో గడ్డి, రాగండి, బొచ్చ రకాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లో రెండు టన్నుల చేపలను తీసి ఒడిశా వ్యాపారులకు విక్రయించాల్సి ఉందని, ఈలోగా ఇలా జరగడంతో తీవ్రంగా నష్టపోయానని బాధితుడు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా  సమీపంలో ఉన్న గోతుల్లో చేపలు బతికే ఉన్నాయి. ప్రధాన చెరువులో చేపలు చనిపోవడంతో విష ప్రయోగం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని