logo

నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రాజీనామా

విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు-1 ఇసరపు రేవతిదేవి (వైకాపా) వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

Published : 01 Jun 2023 04:02 IST

రేవతిదేవి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు-1 ఇసరపు రేవతిదేవి (వైకాపా) వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాజీనామాను మేయర్‌ విజయలక్ష్మి ఆమోదించారు.

ఒప్పందం ప్రకారమేనా?

నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్‌- 2గా శాసనసభ ఉపసభాపతి వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి ఎన్నికయ్యారు. మొదటి స్థానంలో సామాజిక వర్గం ఆధారంగా ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ ముచ్చు నాగలక్ష్మిని నియమించారు. ఆమె కొన్ని నెలలకే మరణించడంతో 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ రేవతిదేవి 2021 ఆగస్టు 4న ఎన్నికయ్యారు. ఒప్పందం ప్రకారం ఆమె ఒకటిన్నర ఏడాది తర్వాత రాజీనామా చేయాల్సి ఉంది. ఈ మేరకు మొదట్లోనే వైకాపా నాయకులు ఆదేశాలిచ్చారు. దీంతో ఆమె దిగిపోయారు. ఆ స్థానంలో 7వ డివిజన్‌ నుంచి పి.మాలతి, ఒకటో డివిజన్‌ నుంచి ఎం.లయ(నాగలక్ష్మి కుమార్తె) పేర్లు తెరమీదకు వచ్చాయి. ఈ నెల 8న ఎన్నిక నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నుంచి కలెక్టర్‌కు ఆదేశాలొచ్చాయని కమిషనరు శ్రీరాములునాయుడు చెప్పారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని