logo

కొండను తొలిచి.. గట్టు వేసి..

మండలంలోని మర్రివలస రెవెన్యూ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలం పక్కనున్న కొండపై గుర్తు తెలియని వ్యక్తులు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు.

Published : 07 Jun 2023 03:49 IST

ఆక్రమణలను పరిశీలిస్తున్న తహసీల్దారు రమేష్‌, ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు తదితరులు

దత్తిరాజేరు, న్యూస్‌టుడే: మండలంలోని మర్రివలస రెవెన్యూ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలం పక్కనున్న కొండపై గుర్తు తెలియని వ్యక్తులు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు. కొండ దిగువ భాగంలో యంత్రాలతో ఒక మినీ రిజర్వాయరుకు నిర్మించినంత గట్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొండ ప్రాంతం ఆక్రమణలకు గురి కాగా మరింత భూమిని తవ్వేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం విశ్వవిద్యాలయ స్థల పరిశీలనకు ఆర్డీవో శేష శైలజతో పాటు వెళ్లిన ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు దీన్ని చూశారు. వెంటనే తహసీల్దారు రమేష్‌ను రప్పించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా తవ్వుతున్నారని, విచారణ చేపడతామని తహసీల్దారు చెప్పారు.

కొండ దిగువ భాగంలో ఏర్పాటు చేసిన గట్టు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని